రూ.4.67 లక్షలపై 45 శాతం పన్ను!

పాక్​ ప్రభుత్వాధికారుల వెల్లడి లబోదిబోమంటున్న సామాన్యులు

Jun 9, 2024 - 18:51
 0
రూ.4.67 లక్షలపై 45 శాతం పన్ను!

ఇస్లామాబాద్​: పాక్​ లో పన్నుల భారం మోయలేనిదిగా మారింది. రూ. 4.67 లక్షల ఆదాయంపై 45 శాతం పన్ను విధించాలనే నిబంధన అమల్లోకొచ్చింది. దీంతో పాక్​ ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇంతవరకు రూ. 5 లక్షల ఆదాయం 35 శాతం పన్ను విధించేవారు. అయితే ప్రస్తుత విధానంపై పాక్​ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే ధరల భారాన్ని మోయలేక సతమతం అవుతుండగా వచ్చిన సంపదలో సగభాగం ప్రభుత్వానికే పన్ను రూపంలో చెల్లిస్తే ఇక తమకు చేతిలో మిగిలేది చిప్పేనని బహిరంగంగానే ఆవేదన, ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

పన్నుకు సంబంధించి ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసినట్లు పాక్​ ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ఐఎంఎఫ్​ షరతుల వల్ల నే ఈ పన్ను పోటు తప్పక చేపట్టాల్సి వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే పన్నుపై ఇంకా తుది ప్రణాళికకు పీఎం షహబాజ్​ షరీఫ్​ ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనట్లు తెలుస్తోంది.