కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీ పొడిగింపు ఆగస్ట్ 27న విచారణ
Extension of Kejriwal's judicial custody will be heard on August 27
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించి కేజ్రీవాల్ కు మరోసారి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది. జ్యూడీషియల్ కస్టడీని ఆగస్ట్ 27 వరకు పొడిగించింది. మంగళవారం మద్యం కుంభకోణం, బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.
జ్యూడీషియల్ కస్టడీ ముగియడంతో కేసును కోర్టు విచారించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుముందు సీఎం కేజ్రీవాల్ హాజరయ్యారు. సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జీషీట్ ను కోర్టు 27న పరిశీలించే అవకాశం ఉంది. కేజ్రీవాల్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ మనీలాండరిం కేసులో మూడుసార్లు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేశారని గుర్తు చేశారు. రెగ్యులర్ బెయిల్ తోపాటు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా ఆయన ఉదహరించారు. పీఎంఎల్ ఏ కింద కఠినమైన షరతులు విధించినప్పటికీ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయవచ్చని ఆయన కోర్టులో వాదించారు. అయినప్పటికీ కోర్టు సింఘ్వీ వాదనలతో ఏకీభవించలేదు.