నా తెలంగాణ, న్యూఢిల్లీ: అర్హులైన పిల్లలకు విద్యనందించడంలో ప్రోత్సాహం కల్పించాలని, ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతో కోల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా సీఐఎల్ (ఆయుష్మాన్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్) పథకాన్ని దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ధనంజయ్ చంద్రచూడ్, కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ లు పలువురు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, కారుణ్య నియామక పత్రాలను అందించారు.
స్కాలర్ షిప్ పథకం కింద మొత్తం 1645 మదిని దేశంలోని వివిధ హైకోర్టుల రికార్డుల ద్వారా గుర్తించి అందజేశారు. 424మందికి కారుణ్య నియామకాల పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కోల్ ఇండియా లిమిటెడ్ ఉన్నతాధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో సేవా కార్యక్రమాల్లో మరింత ముందుకు..
ఇటీవల మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టాక పాలనలో అనేక సంస్కరణలకు నాందీ పలికారు. ఈ నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా జి.కిషన్ రెడ్డిని నియమించారు. మంత్రి కిషన్ రెడ్ఢి ఆధ్వర్యంలో తక్కువ సమయంలోనే సంస్థ అభివృద్ధి, సంస్థ తరఫున చేపడుతున్న కార్యక్రమాలు, కారుణ్య నియామకాలు, భద్రత, పర్యావరణం రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా ప్రాంతాల్లోని సంస్థ ఉన్నతాధికారులతో కలిసి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లోని 84 విస్తృతమైన మైనింగ్ ప్రాంతాల్లో సీఐఎల్ తన అనుబంధ సంస్థల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కోల్ ఇండియా లిమిటెడ్ ఏప్రిల్ 1, 2024 నాటికి మొత్తం 313 గనులను కలిగి ఉండగా, వాటిలో 131 భూగర్భ గనులు, 168 బహిరంగ గనులు, 14 మిశ్రమ గనులున్నాయి. ఈ సంస్థ వర్క్‌షాప్‌లు, ఆసుపత్రులు, సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.