పాక్ పార్లమెంట్ లో మూషికాల హావా
మార్జాలాలతో అరికట్టాలని నిర్ణయం! రూ. 12 లక్షలు కేటాయింపు
కరాచీ: అసలే ఆర్థికంగా కుదేలవుతున్న పాక్ ను మూషిక రాజులు (ఎలుకలు) మరింత ఆర్థిక కష్టాల్లోకి నెడుతున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిల్లో మూషిక రాజుల వేటకు మార్జాల రాజులను (పిల్లుల)ను రంగంలోకి దింపాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది.
వివరాల్లోకి వెళితే..
పాక్ పార్లమెంట్ లో ఎలుకలు కీలక సమాచారం ఉన్న ఫైళ్లను, కంప్యూటర్ వైర్లను ధ్వంసం చేస్తున్నాయి. ఎలుకల నివారణకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా వాటివల్ల నష్టం తగ్గడం లేదు. దీంతో పాకిస్థాన్ క్యాపిటల్ డెవలప్ మెంట్ అథారిటీ (సీడీఏ) ఎలుకల నివారణ కోసం ఏకంగా రూ. 12 లక్షలను కేటాయించింది. ఎలుకలను నివారణకు సెనేట్ లో పిల్లులను పెంచడం ఒక్కటే మార్గమని నిపుణుల సలహాలతో పిల్లులను వదలాలను నిర్ణయించారు. మొత్తానికి పాక్ పార్లమెంట్ లో ఇక మూషిక రాజులే కాదు మార్జాలా రాజుల పాత్ర కూడా ఉండనుందన్నమాట అని ఈ విషయం తెలిసిన వారు నవ్వుకుంటున్నారు.