సీఎం కేజ్రీవాల్​ జ్యూడీషియల్​ రిమాండ్​ పొడిగింపు

Extension of CM Kejriwal's judicial remand

Jun 19, 2024 - 17:05
 0
సీఎం కేజ్రీవాల్​ జ్యూడీషియల్​ రిమాండ్​ పొడిగింపు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్​ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ కు కోర్టు జ్యూడీషియల్​ రిమాండ్​ ని పొడిగించింది.  బుధవారం బెయిల్​ పిటిషన్​ పైవిచారణ జరిపిన కోర్టు జూలై 3 వరకు జ్యూడీషియల్​ రిమాండ్​ ను పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. మనీలాండరింగ్​ కేసులో కేజ్రీవాల్​ రౌస్​ అవెన్యూ కోర్టులో మధ్యంతర బెయిల్​ పిటిషన్​ దాఖలు చేశారు. విచారణలో న్యాయమూర్తి మాట్లాడుతూ.. కేజ్రీవాల్​ ఆరోగ్య పరీక్షల కోసం బెయిల్​ కోరారు. దీనిపై జైలు సూపరింటెండెట్​ ను వివరణ కోరామన్నారు. వారి సమాధానం వచ్చాక బెయిల్​ పై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్​ ఈడీ కస్టడీలో కాకుండా జ్యూడీషియల్​ రిమాండ్​ లో ఉన్నారని న్యాయమూర్తి పేర్కొన్నారు.