మద్యం కుంభకోణం మాజీ ఐఏఎస్​ అనిల్​ అరెస్ట్​

చత్తీస్​ గఢ్​ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఐఏఎస్​ అనిల్​ తుతేజాను ఈడీ ఆదివారం అరెస్టు చేసింది.

Apr 21, 2024 - 13:35
 0
మద్యం కుంభకోణం మాజీ ఐఏఎస్​ అనిల్​ అరెస్ట్​

రాయ్​ పూర్​: చత్తీస్​ గఢ్​ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఐఏఎస్​ అనిల్​ తుతేజాను ఈడీ ఆదివారం అరెస్టు చేసింది. రూ.  2,161 కోట్ల కుంభకోణం ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసింది. 
కుంభకోణంపై గతంలోనే ఈడీ  కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. మద్యం కుంభకోణంలో భారీ అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. గతంలో అనిల్​ విచారణకు సమన్లు కూడా జారీ చేసింది. విచారించింది. ఆదివారం కూడా ఆయన్ను విచారించేందుకు పిలిచి అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా ఆయన కుమారుడు యశ్​ కుడా రాగా అతన్ని ఈడీ పంపించివేసింది.

అనిల్​ ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఏడాది క్రితమే అనిల్​ రిటైర్​ అయ్యారు. ఆదాయయపు పన్ను శాఖ ఫిర్యాదు ఆధారంగా కూడా ఈయనపై విచారణ జరిగింది. ఈ కుంభకోణంలో మొత్తం 70 మంది ఉన్నట్లుగా ఈడీ పేర్కొంటోంది. ప్రతీ మద్యం సీసా నుంచి అదనంగా డబ్బులు కాంగ్రెస్ నాయకుడు ఐజాజ్ సోదరుడు అన్వర్ ధేబర్ కు వెళ్లేవని ఈడీ గుర్తించింది.

ఈడీ అరెస్టులపై చత్తీస్​ గఢ్​ సీఎం విష్ణుదేవ్​ సాయ్​ మాట్లాడుతూ ఈడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని పేర్కొన్నారు. ఎన్నికలతో ప్రభుత్వాలతో ఈడీకీ సంబంధం లేదన్నారు. అవినీతి ఎక్కడ జరిగినా ఈడీ స్వయంగా దర్యాప్తు చేసే అధికారాన్ని కలిగి ఉందని అన్నారు. ఈ కేసులో గతంలోనే పలువురిని ఈడీ అరెస్టు చేసింది.