హ్యాట్రిక్​ కు బీజేపీ రెఢీ షారూఖ్​ తండ్రికి ఒక్క ఓటూ రాలే!

హరియాణాలోని గురుగ్రామ్​ లోక్​ సభ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆది నుంచి ఈ లోక్​ సభ స్థానంలో కాంగ్రెస్​ వరుస విజయాలు సాధిస్తోంది.

Apr 9, 2024 - 17:02
 0
హ్యాట్రిక్​ కు బీజేపీ రెఢీ షారూఖ్​ తండ్రికి ఒక్క ఓటూ రాలే!

గురుగ్రామ్​: హరియాణాలోని గురుగ్రామ్​ లోక్​ సభ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆది నుంచి ఈ లోక్​ సభ స్థానంలో కాంగ్రెస్​ వరుస విజయాలు సాధిస్తోంది. కానీ ప్రధాని మోదీ 2014లో అధికారం చేపట్టిన రెండుసార్లు కూడా ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఇంద్రజిత్​ భారీ విజయం సాధిస్తూ మోదీ సరసన హ్యాట్రిక్​ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ స్థానానికి మరో విశేషం ఉంది. 1957లో జరిగిన లోక్​ సభ ఎన్నికల్లో షారూఖ్​ ఖాన్​ తండ్రి మహమ్మద్​ ఖాన్​ కు ఒక్క ఓటు పడకపోవడం విశేషం. 1958లో అబుల్ కలాం మరణానంతరం ఉప ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం ఉన్నప్పటికీ, ఆర్యసమాజ్ నాయకుడు ప్రకాశవీర్ శాస్త్రి ఎన్నికల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ నేత ఎం.చంద్రను ఓడించారు.