సోపోర్ లో ఎన్ కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతం
Two terrorists killed in encounter in Sopore
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సోపోర్ హడిపోరాలో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. బుధవారం సెర్చింగ్ ఆపరేషన్ లో ఉన్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఉగ్రవాదులు ఉన్న సమాచారంతో భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఎదురు కాల్పుల్లో ఓ జవాన్ కు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. అతన్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా సెర్చింగ్ ఆపరేషన్ సమయంలో స్థానికంగా ఉన్న పలు దుకాణా సముదాయాలను భద్రతా బలగాలు ముందుజాగ్రత్తగా మూయించి వేశాయి. మరోవైపు సెర్చింగ్ ఆపరేషన్ లో అనుమానాస్పద బ్యాగు, సైనిక దుస్తులు, కాట్రిడ్జ్ లు స్వాధీనం చేసుకున్నారు.