బీజేపీ 17వ లిస్టు విడుదల

రాయ్​ బరేలీ, కైసర్​ గంజ్​ దినేష్ ప్రతాప్​ సింగ్​​, కరణ్​ భూషణ్​ సింగ్​

May 2, 2024 - 18:05
 0
బీజేపీ 17వ లిస్టు విడుదల

నా తెలంగాణ, న్యూఢిల్లీ: రాయ్​ బరేలీ, కైసర్​ గంజ్​ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సీట్లలో బీజేపీ గురువారం తమ అభ్యర్థులను ప్రకటించింది. రాయ్​ బరేలీ నుంచి దినేష్​ ప్రతాప్​ సింగ్​ ను రంగంలోకి దించగా, కైసర్​ గంజ్​ నుంచి కరణ్​ భూషణ్​ సింగ్​ కు టికెట్​ కేటాయిస్తూ సాయంత్రం అధికారికంగా బీజేపీ 17వ జాబితాను విడుదల చేసింది. దీంతో ఈ రెండు సీట్లపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరవీడినట్లయ్యింది. 

రాయ్‌బరేలి నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన దినేష్​ ప్రతాప్​ సింగ్​ 2018లో కాంగ్రెస్​ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన యూపీ ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ దినేష్ ప్రతాప్ సింగ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. 

2019 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీపై దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే రాయ్​ బరేలీలో అధిక ప్రాబల్యం ఉన్న పంచవటికి చెందిన వ్యక్తి కావడంతో బీజేపీ ఇతని వైపు మొగ్గు చూపింది. 

కైసర్‌గంజ్ స్థానం నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చిన్న కుమారుడు కరణ్ భూషణ్‌. 1990న జన్మించిన ఈయనకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. డబుల్​ ట్రాప్​ షూటింగ్​ లో జాతీయ క్రీడాకారుడు కావడం గమనార్హం. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం నుంచి బీబీఏ, ఎల్ఎల్‌బీ డిగ్రీలను పొందారు. ఆస్ట్రేలియా నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా కూడా చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కరణ్ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు.