మూడింట ఒకవంతు మహిళలకే మహిళా రిజర్వేషన్లపై బార్​ అసోసియేషన్​ ను ఆదేశించిన సుప్రీం

మే 16న ఎన్నికలు, 18న ఫలితాలు

May 2, 2024 - 16:50
May 2, 2024 - 16:57
 0
మూడింట ఒకవంతు మహిళలకే మహిళా రిజర్వేషన్లపై బార్​ అసోసియేషన్​ ను ఆదేశించిన సుప్రీం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బార్​ అసోసియేషన్​ ఎన్నికల్లో మహిళల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మూడింట ఒకవంతు మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం బీడీ కౌశిక్ కేసులో కోర్టు పాత నిర్ణయాన్ని స్పష్టం చేస్తూ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇక నుంచి ఎస్సీబీఏలో ముగ్గురు ఎగ్జిక్యూటివ్ సభ్యులు, ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, కోశాధికారిగా మహిళలే ఉంటారని కోర్టు స్పష్టం చేసింది.

ధర్మాసనం సూచనల ప్రకారం, ట్రెజరీ పదవి అంటే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కోశాధికారి పదవి మహిళకు రిజర్వ్ చేస్తారు.  దీంతో పాటు సంఘం కార్యవర్గంలోని తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలుండనున్నారు. మే 16న జరగనున్న సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో తొలిసారిగా ఈ ఉత్తర్వులు అమలులోకి రానుండడం విశేషం. ఈ ఎన్నికల ఫలితాలు మే 18 (ఆదివారం)న వెల్లడిస్తారు.