బొగ్గు ఉత్పత్తి, సరఫరా పెరుగుదలకు చర్యలు

అధికారులతో సమావేశమైన కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Jun 19, 2024 - 20:53
 0
బొగ్గు ఉత్పత్తి, సరఫరా పెరుగుదలకు చర్యలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బొగ్గు ఉత్పత్తి, సరఫరాను పెంచడంలో తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి దృష్టి సారించారు. బుధవారం న్యూ ఢిల్లీలోని ఆ శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అధికారులు ఉత్పత్తి, సరఫరాలపై ఇచ్చిన పత్రాలను పరిశీలించారు. ఉత్పత్తిని స్థిరంగా కొనసాగించడంపై దృష్టి సారించాలన్నారు. అదే సమయంలో దిగుమతులను తగ్గించాలన్నారు. సాంకేతికత మరింత వినియోగంపై దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో కొనసాగుతున్న ప్రాజెక్టులపై కూడా జి.కిషన్​ రెడ్డి అధికారులతో సమీక్షించారు.