మోగిన ఎన్నికల నగరా? అన్ని పార్టీలు అప్రమత్తం

elections.. All parties alert

Oct 15, 2024 - 17:47
 0
మోగిన ఎన్నికల నగరా? అన్ని పార్టీలు అప్రమత్తం
ఎన్డీయే, మహావికాస్​ అఘాడీలు అప్రమత్తం
విజయం కోసం విశ్వ ప్రయత్నాలలో పార్టీలు
రెండో ఆర్థిక రాజధానిపై అందరి చూపు
ముంబాయి: ఎన్నికల నగరా మోగింది. దేశానికి ఆర్థిక రాజధానిగా పేరు పొందిన మహారాష్​ర్టలో ఎన్నికల ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. దీనికి తోడు ఎన్నికలకు కేవలం 45 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో అన్ని పార్టీలు రాజకీయాస్ర్తాలను, అభ్యర్థులను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. 
 
మహారాష్ర్టలో ఉన్న ఏడు పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. 288 స్థానాలున్న మహా అసెంబ్లీలో 2019 ఎన్నికలలో బీజేపీకి 105 – 22.75 శాతం, శివసేన 56 – 16. 41, కాంగ్రెస్​ 44–15.87 శాతం, ఎన్సీపీ 54–16.71 శాతం, స్వతంత్రులు 13–9.93, ఇతరులు 16 – 18.33 శాతం ఓట్లను సాధించారు. మహారాష్ర్టను కైవసం చేసుకోవాలంటే 145 స్థానాల్లో గెలుపొందాల్సిన అవసరం ఉంది. 2019లో ఎన్డీయే కూటమి పక్షాలు 161 స్థానాలను సాధించాయి. 
 
2022లో ఏక్​ నాథ్​ షిండే (శివసేన)లు, అజిత్​ (ఎన్సీపీ) వర్గంలో చీలికలు ఏర్పడి ఎన్డీయేలో కలిశారు. దీంతో బీజేపీ బలం మరింత పెరిగింది. 
 
ఎన్డీయే..
ఎన్డీయే 2022 తరువాత బీజేపీ 106, శివసేన (ఏక్​ నాథ్​ షిండే) 40, ఎన్సీపీ (అజిత్​) 12, ఇతరులు 9 స్థానాలతో 167స్థానాలు దక్కాయి. అనంతర పరిణామాలలో బీజేపీ 102, శివసేన 38, ఎన్సీఈ 40, ఇతరులు22 స్థానాలతో ఎన్డీయే బలం 202కు పెరిగింది. 
 
మహావికాస్​ అఘాడీ..
కాంగ్రెస్​ 44, శివసేన (యూబిటీ ఉద్దవ్​ ఠాక్రే) 16, ఎన్సీపీ (శరద్​ పవార్​ )53, ఇతరులు 3 స్థానాలతో 116 స్థానాలు దక్కాయి.  అనంతర పరిణామాలతో కాంగ్రెస్​ 37, శివసేన (యూబీటీ) 16, ఎన్సీపీ (12), ఇతరులు 1 స్థానంతో మహావికాస్​ అఘాడీ 66 స్థానాలున్నాయి. 
 
మహారాష్ర్టలో పోటీ చేస్తున్న స్థానాలలో ఎంఐఎం–2, ఎస్పీ–2, సీపీఐ (ఎం)–1 స్థానాలలో విజయం సాధించాయి. 
 
2024లో కూడా ఇదే పొత్తును కొనసాగిస్తున్నట్లు ఎన్డీయే, మహావికాస్​ అఘాడీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తక్కువ సమయం ఉండడంతో పొత్తుల్లో సీట్లు, గెలుపు అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం అన్ని పార్టీలకు కత్తిమీద సాములా మారింది.