ఎన్​ ఎస్​ జీ అభ్యర్థకు జర్మనీ ఆమోదం

ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం

Apr 28, 2024 - 16:18
 0
ఎన్​ ఎస్​ జీ అభ్యర్థకు జర్మనీ ఆమోదం

న్యూఢిల్లీ: భారత్‌, జర్మనీ మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా కీలక ముందడుగు పడింది. ఎంపీ5 సబ్‌మెషీన్‌ గన్‌లకు సంబంధించిన విడిభాగాలు, ఉపకరణాల కొనుగోలుపై జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్​జీ) చేసిన అభ్యర్థనకు జర్మనీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్‌ సహా యూరోపియన్‌ యూనియన్‌లో సభ్యత్వం లేని దేశాలకు విక్రయించడంపై జర్మనీ గతంలో ఆంక్షలు విధించింది.

ఆంక్షలను ఎత్తివేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్‌కు భారీ మినహాయింపు లభించిందని, మన దేశంతో భాగస్వామ్యానికి జర్మనీ ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దాదాపు 15ఏళ్ల క్రితం అమ్మకాలపై ఆంక్షలు విధించడానికి ముందు జర్మన్‌ కంపెనీ హెక్లర్‌ అండ్‌ కోచ్‌ తయారు చేసిన ఎంపీ5లను ఎన్​ ఎస్​ జీ కొనుగోలు చేసింది.

ఇప్పుడు ఆంక్షల ఎత్తివేతతో భారత సైన్యం, పారామిలటరీ దళాలు, రాష్ట్ర పోలీసు బలగాలకు చిన్నపాటి ఆయుధాలు కొనుగోలు చేసే అవకాశం లభించనుంది. నేవీ మెరైన్‌ కమాండోలు కూడా ఎంపీ5లను ఉపయోగిస్తున్నారు.