బీఎస్పీ ఎమ్మెల్యే హత్య..
ఆరుగురికి యావజ్జీవ కారగారం తీర్పు వెల్లడించిన లక్నో సీబీఐ కోర్టు
లక్నో: సంచలనం సృష్టించిన బీఎస్సీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారికి యావజ్జీవ కారగార శిక్షతోపాటు రూ. 50వేల జరిమానా విధించింది. లక్నో సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణకొచ్చింది. గతంలోనే వాదనలు, సాక్ష్యాలను పూర్తిగా విచారించిన కోర్టు నిందితులను శుక్రవారం దోషులుగా పేర్కొంటూ, శిక్షలు కూడా ఖరారు చేసింది. ఈ కేసులో నిందితుడు ఫర్హాన్‌కు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందున నాలుగేళ్ల జైలు శిక్ష రూ. 20వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దోషుల్లో ఇస్రార్ అహ్మద్, రంజిత్ పాల్, జావేద్, అబిద్, గుల్షన్, అబ్దుల్ కవిలు దోషులుగా కోర్టు పేర్కొంది.