పనితీరులో నైతిక విలువలు కీలకం

విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ సూచన

Oct 3, 2024 - 14:18
 0
పనితీరులో నైతిక విలువలు కీలకం

జైపూర్​: విద్యార్థులు నైతిక విలువలు పాటించాలని, వారి పనితీరులో ఈ విలువలు ఒక భాగం కావాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ పిలుపునిచ్చారు. గురువారం రాజస్థాన్​ ఉదయ్​ పూర్​ మోహన్​ లాల్​ సుఖాడియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. అంబేద్కర్​ విద్య కంటే గుణమే ముఖ్యమని గుర్తించారని, విశ్వసించారని తెలిపారు. విద్యార్థులు ప్రతీ విషయంలోనూ చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. 21వ శతాబ్ధంలో ప్రతీ రంగం వేగంగా మార్పు చెందుతుందని తెలిపారు. విజ్ఞానం, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో వంటి రంగాల్లో కూడా గణనీయమైన మార్పులు చెందాయన్నారు. ఈ తరుణంలో విద్యార్థులు తమ విద్యను సద్వినియోగం చేసుకోని నూతన శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అదే సమయంలో సామాజిక బాధ్యతల్లో కూడా సమతుల్యత పాటించాలన్నారు. 2047 నాటికి దేశం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేలా యువత ప్రయత్నించాలని తెలిపారు. దేశాభివృద్ధికి యువత సహకారం ఎంతో అవసరమని రాష్ర్టపతి చెప్పారు. ప్రస్తుతం ప్రతీ రంగంలోనూ మహిళలు ఎదగడం అత్యంత సంతోషకరమని తెలిపారు. ఇది భారత్​ కే గాక ప్రపంచదేశాలకు కూడా గర్వకారణమన్నారు.