లిక్కర్​ స్కామ్​ ఆప్​ మంత్రి కైలాష్​ గెహ్లాట్​ను విచారిస్తున్న ఈడీ

మద్యం కుంభకోణంలో ఆప్​ మంత్రి కైలాష్​ గెహ్లాట్​ను ఈడీ విచారిస్తోంది. గెహ్లాట్​ విచారణకు రావాలని శుక్రవారం సమన్లు పంపింది.

Mar 30, 2024 - 17:26
 0
లిక్కర్​ స్కామ్​ ఆప్​ మంత్రి కైలాష్​ గెహ్లాట్​ను విచారిస్తున్న ఈడీ

న్యూఢిల్లీ: మద్యం కుంభకోణంలో ఆప్​ మంత్రి కైలాష్​ గెహ్లాట్​ను ఈడీ విచారిస్తోంది. గెహ్లాట్​ విచారణకు రావాలని శుక్రవారం సమన్లు పంపింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆయన ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మద్యం పాలసీ రూపొందించిన వారిలో మంత్రి కైలాష్​ గెహ్లాట్​ కూడా ఉన్నారని ఈడీ వెల్లడించింది. కైలాష్ గెహ్లాట్ తన అధికారిక నివాసాన్ని దక్షిణాది మద్యం వ్యాపారి విజయ్ నాయర్‌కు ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో కైలాష్ గెహ్లాట్ తన మొబైల్ నంబర్‌ను కూడా పలుమార్లు మార్చుకున్నారని ఈడీ గతంలో పేర్కొంది. డ్రాఫ్ట్​ తయారీ సందర్భంగా డబ్బులు ఎన్ని చేతులు మారి ఎవరెవరి వద్దకు చేరాయన్న విషయాలపై ఈడీ కూపీ లాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో దిగ్గజ నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ స్కామ్​లో తొలిసారిగా పంజాబ్​ మూలాలు కూడా లభించినట్లు ఈడీ పేర్కొంటోంది.