నిరుద్యోగులను మోసం చేయొద్దు
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి. చెన్నయ్య
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: మాలలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను గ్రామాలలో చర్చల ద్వారా ప్రజలకు వివరించాలని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి చైర్మన్ జి. చెన్నయ్య పిలుపునిచ్చారు. పోరాట సమితి నిర్వహిస్తున్న బస్సు యాత్ర 9వ రోజు సంగారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా ముఖ్య నాయకుల సమావేశం బి. మల్లేశం అధ్యక్షతన సంగారెడ్డి టీఎన్జీవో భవన్ లో శనివారం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నవంబర్ 24 హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేలా అవగాహన కల్పించాలన్నారు. రాష్ర్టంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఆపి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించారు. వెంటన నిరుద్యోగ భృతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అహార్నిశలు కష్టపడ్డ మాలలకు యనివర్సిటీ వీసీలతోపాటు మిగతా నామినేటెడ్ పోస్టులలో అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా మాలలపై ప్రభుత్వానికి ఉన్న ద్వేషాన్ని విడనాడాలని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కో - చైర్మన్ లు బూర్గుల వెంకటేశ్వర్లు, తల్లపల్లి రవి, చెరుకు రాంచందర్, గోపోజు రమేష్, మంత్రి నరసింహయ్య, మంచాల లింగ స్వామి, బేర బాలకిషన్, ఎ.చెన్న కేశవులు, మేక వెంకన్న, గద్ద శ్రీను, తాలుక అనిల్, యస్. నాను, జిల్లా అధ్యక్షులు ఏ మల్లేశం, ఉపాధ్యక్షులు బి. అశోక్ కుమార్, డా. బి జనార్దన్, అనంతయ్య, విజయ రావు, బక్కన్న, రాజు, పుండరీకం, మొగిలయ్య, జె.గోపాల్, మోహన్ రాజ్, సుజాత, అనిత, దేవయ్య, మణియ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.