ఎంఆర్ఎస్ ఏఎం అభివృద్ధికి బెల్, ఐఏఐ భాగస్వామ్యం
Bell, IAI partnership for development of MRS AM
బెంగళూరు: భారత రక్షణ రంగం బీఈఎల్ (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్), ఇజ్రాయెల్ ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ ఇండస్ట్రీస్ (ఐఏఐ) సంయుక్త భాగస్వామ్యంతో మరింత బలోపేతం అవుతుందని బీఈఎల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇరుదేశాల జాయింట్ వెంచర్ ద్వారా భారత్ కు చెందిన సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్ లకు మరింత ఊతం లభించనుంది. ఇజ్రాయెల్ రక్షణ రంగ సంస్థ ఈ మిస్సైల్ వ్యవస్థను మరింత కీలకంగా రూపొందించడంలో బెల్ కు సహాయం చేయనుంది.
ఎంఆర్ ఎస్ ఏఎం?..
ఎంఆర్ఎస్ ఏఎం (మీడియాం రేంజ్ సర్ఫేస్ టు ఏయిర్ మిస్సైల్స్) ఒక అధునాతన మార్గం బ్రేకింగ్ ఎయిర్, క్షిపణి రక్షణ వ్యవస్థ. ఇది అనేక రకాల వైమానిక ముప్పుల నుంచి రక్షణను అందిస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ లోని ఐరన్ డ్రోమ్ ల నుంచి ప్రయోగించే రాకెట్ వ్యవస్థ లాంటిది. ఈ వ్యవస్థను భారత రక్షణ దళాల కోసం ఐఏఐ, డీఆర్డీవోలు అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం వీటిని భారత్, ఇజ్రాయెల్ లు ఉపయోగిస్తున్నాయి. దీన్నే మరింత మెరుగుపరిచేందుకు బెల్ ఐఏఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యవస్థలో అధునాతన శ్రేణి రాడార్, కమాండ్, కంట్రోల్ షెల్టర్, మొబైల్ లాంచర్, ఆర్ ఎఫ్ సీకర్‌తో కూడిన ఇంటర్‌సెప్టర్ లు ఉండనున్నాయి.