విదేశాల్లో నీతిసూక్తులు పార్లమెంట్​ లో కునుకు!

బాబా ఆల్​ టైమ్​ రికార్డ్​

Sep 12, 2024 - 13:39
 0
విదేశాల్లో నీతిసూక్తులు పార్లమెంట్​ లో కునుకు!
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారతదేశం గురించి విదేశాల్లో నీతిసూక్తులు బోధిస్తున్న కాంగ్రెస్​ ఎంపీ రాహుల్​ గాంధీ (బాబా) తన పనితీరులో మాత్రం ఆశించిన స్థాయిలో చురుకుగా లేరు. పార్లమెంట్​ లో ప్రజాసంక్షేమం దృష్టా స్పందించాల్సిన, చర్చించాల్సిన విషయాలను పక్కదోవపట్టించేలా చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాట పెట్టడమనే లక్ష్యంతోనే ఉన్నారు. ఏనాడు ప్రజసమస్యలపై నిష్పక్షపాతంగా పార్లమెంట్​ లో ప్రశ్నలు అడిగి వాటికి జవాబులు తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలను ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తూ వెలికితీయడంలో విఫలమయ్యారు.
 
బాబా పార్లమెంట్​ లో పనిచేసిన తీరును ఓసారి గమనిద్దాం. 2015లో 15వ లోక్​ సభ సమావేశాల్లో 43 హాజరు శాతం నమోదైంది.  రెండు చర్చల్లో మాత్రమే పాల్గొన్నారు. 300 ప్రశ్నలకు ఒక్క ప్రశ్న కూడా అడగలేదు.
 
16వ లోక్​ సభలో 52 శాతం హాజరు నమోదు కాగా, 14 (67.1శాతం) చర్చల్లో పాల్గొన్నారు. 293 ప్రశ్నలకు గాను ఒక్క ప్రశ్న అడగలేదు.
 
17వ లోక సభలో 51 హాజరు శాతం నమోదు కాగా, 8 చర్చల్లో (46.7శాతం) పాల్గొన్నారు. 210 ప్రశ్నలకు గాను 99 ప్రశ్నలు అడిగారు.
 
ఇది రాహుల్​ గాంధీ లోక్​ సభ సమావేశాల్లో ప్రజాశ్రేయస్సు కోరి తీసుకున్న చర్యల ఆల్​ టైమ్​ రికార్డ్​. 
 
ఈ సందర్భంగా పార్లమెంట్​ లో పలుమార్లు కునుకుతీస్తూ కూడా కెమెరా కంటికి చిక్కారు. ఈ చిత్రాలను చూసిన పలువురు ప్రజాశ్రేయస్సు కంటే రాహుల్​ కు కునుకు తీయడమే ముఖ్యమని ఛలోక్తులు కూడా విసిరారు.