వివాదాలు, సవాళ్లపై శాంతియుత నిబద్ధతతో భారత్​ 

India with a peaceful commitment to disputes and challenges

Nov 21, 2024 - 12:43
 0
వివాదాలు, సవాళ్లపై శాంతియుత నిబద్ధతతో భారత్​ 

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​
లావోస్​ ప్రాంతీయ భద్రతా సదస్సులో కేంద్రమంత్రి

లావోస్: సరిహద్దు వివాదాలు, వాణిజ్య ఒప్పందాలు, ప్రపంచ సవాళ్లపై భారత విధానం శాంతియుత చర్చలకు నిబద్ధతగా ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ అన్నారు. గురువారం లావోస్​ లో ప్రాంతీయ భద్రతా మావేశంలో పాల్గొని భారత్​ విధానాన్ని వివరించారు. వివాదాలపై ఆసియాన్​ దేశాలకు తమ విధానాన్ని వివరించారు. శాంతియుత దిశగానే పరిష్కార మార్గాలకు తొలి ప్రాధాన్యతనిస్తామన్నారు. ఈ సమావేశంలో తమ విధానాలు ప్రపంచదేశాల్లో మరింత నమ్మకం పెంచుతాయని, శాశ్వత భాగస్వామ్యాలకు ఇది పునాది వేస్తుందని అన్నారు. ప్రపంచదేశాలు వివాదాలపై పరస్పర అభిప్రాయాలను గౌరవించినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని భారత్​ విశ్వసిస్తుందని స్పష్టం చేశారు. 

బుద్ధభగవానుడి సూత్రాలను పాటిస్తూ శాంతియుత పరిష్​కార మార్గాలను కలిసి వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దక్షిణ చైనా సముద్రం వివాదాలపై మాట్లాడుతూ భారత్​ అంతర్జాతీయ చట్టానికి కట్టుబడి ఉందన్నారు. ఎలాంటి ప్రవర్తనా నియమావళి అయినా పూర్తిగా అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉండాలని మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​ స్పష్టం చేశారు. 1982 యూఎన్​ సముద్రచట్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాలపై అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సమావేశం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఆసియాన్‌లో చేరిన దేశాలు లావోస్‌లో చైనాతో నేరుగా మాట్లాడుతున్నాయి. చైనాతో ఫిలిప్పీన్స్​, వియత్నాం, మలేషియా, బ్రూనై దేశాలకు కూడా వివాదాలున్నాయి. ఆయా సమస్యల పరిష్కారానికి ఆసియన్​ సభ్యదేశాలు ఇండోనేషియా, థాయిలాండ్, మయన్మార్, సింగపూర్, లావోస్, కంబోడియా కలిసి సమావేశాలు నిర్వహించాయి.