లాంతరు పాలనే కొనసాగితే చార్జీంగ్​ లు కూడా కావు

రాజ్యాంగాన్ని ఎవ్వరూ మార్చలేరు చంద్రయాన్​ పై కథలు తప్పని నిరూపించాం రాముడి నుదుట సూర్య కిరణాలు అహాంకార కూటమి కోటలు బద్దలు కాక తప్పదు గయా ఎన్నికల సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Apr 16, 2024 - 12:47
 0
లాంతరు పాలనే కొనసాగితే చార్జీంగ్​ లు కూడా కావు

పాట్నా: లాంతరు (కాంగ్రెస్) పాలన కొనసాగి ఉంటే నేడు మొబైల్ బ్యాటరీ కూడా ఛార్జింగ్ అయ్యేది కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. చంద్రయాన్​ పై ప్రయాణంతో ఒకప్పుడు కథలు చెప్పుకునే వాటిని తప్పుగా నిరూపించగలిగామని పేర్కొన్నారు. డాక్టర్​ బాబా సాహెబ్​ అంబేద్కర్​ రాసిన రాజ్యాంగాన్ని ఎవ్వరూ మార్చలేరని రాజ్యాంగ సభకు డాక్టర్​ రాజేంద్ర ప్రసాద్​ నేతృత్వం వహించారని వీరి సమక్షంలో దేశంలో ఎన్నో పరిస్థితులను అవపోసన పట్టి ఎన్నో దేశాల రాజ్యాంగాలను సమీక్షించి రాసిన ఘనత అంబేద్కర్​ కే చెందుతుందన్నారు. దేశంలోని ప్రముఖులతో చర్చించి వారి మనోభావాలను అర్థం చేసుకొని రూపొందించినదే రాజ్యాంగం అని ప్రధాని మోదీ వివరించారు. అయోధ్యలో రాముని నుదుటిని సూర్య కిరణాలు తాకనున్నాయని దీంతో అహంకార పూరిత కూటమి కోటలు బద్ధలు కావాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

బిహార్​ లోని గయాలో పూర్నియా ఎన్నికల సభలో ప్రధానమంత్రి మాట్లాడారు. ఏప్రిల్​ 19న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో దేశ హితం కోసం పాటుపడేవారికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బలమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం దేశానికి అవసరమని ప్రధాని తెలిపారు. గయా నుంచి జితన్‌రామ్‌ మాంఝీని, ఔరంగాబాద్‌ నుంచి సుశీల్‌ కుమార్‌ సింగ్‌ను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాంఝీని రాజకీయాలకు పెద్ద దళిత ముఖంగా అభివర్ణించిన ఆయన సింగ్‌ను బీజేపీ సీనియర్ ఎంపీగా అభివర్ణించి ఇద్దరినీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

దేశంలో హిందూ మతాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు కాంగ్రెస్​, కూటమి పార్టీలు కుట్రలు పన్నాయన్నారు. ఆ అయోధ్య రాముడి దయ వల్ల వారి ఆశలు ఇక ఎన్నటికీ నెరవేర బోవన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.