పర్యావరణం, పారిశ్రామికం ఏకకాలంలో అభివృద్ధి

జీఇపీ ఇండెక్స్​ ప్రారంభంలో ఉత్తరాఖండ్​ సీఎం ధామి

Jul 19, 2024 - 18:49
 0
పర్యావరణం, పారిశ్రామికం ఏకకాలంలో అభివృద్ధి

డెహ్రాడూన్​​: రాష్ట్రంలో పర్యావరణ ప్రణాళికలు, పారిశ్రామిక కార్యకలాపాలు ఏకకాలంలో అభివృద్ధిని సాధిస్తున్నాయని ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్​ సింగ్​ ధామి అన్నారు. డెహ్రాడూన్​ లో శుక్రవారం జీఇపీ ఇండెక్స్​ ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ధామి మాట్లాడుతూ.. పర్యావరణ అభివృద్ధి సూచికలో ప్రపంచంలోనే ఉత్తరాఖండ్​ ముందు వరుసలో ఉందన్నారు. దేశంలో రాష్ర్టం పర్యావరణ వ్యవస్థ ద్వారా ఆర్థిక వృద్ధిని కూడా సాధించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పుష్కర్​ సింగ్​ ధామి సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం అన్నారు.