బైరాబీ-సాయిరాంగ్ ప్రాజెక్ట్ 93శాతం పనులు పూర్తి
కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన గవర్నర్ కంభంపాటి హరిబాబు
ఐజ్వాల్: బైరాబీ-సాయిరాంగ్ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ కు కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ పూర్తి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని మిజోరాం గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి హరిబాబు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం మిజోరాంకు చెందిన ఈ కీలక ప్రాజెక్టు కనెక్టివిటీకి సంబంధించిన పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బైరాబీ–సాయిరాంగ్ రైల్వే ప్రాజెక్టు పనులు 93 శాతం పూర్తి అయినట్లు అధికారులు గవర్నర్ కు వివరించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ. 8213.72 కోట్లను ఖర్చు చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే బైరాబీ–సాయిరాంగ్ ల మధ్య దూరం 51.38 కిలోమీటర్లు తగ్గనుందని అధికారులు గవర్నర్ కు వివరించారు. ప్రాజెక్టు పూర్తి అయితే రవాణా రంగం ద్వారా మిజోరాం ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు గవర్నర్ కు పుష్పగుచ్చమిచ్చి సత్కరించారు.