వాతావరణం మార్పులు తక్షణ చర్యలు అవసరం

ఉపరాష్ట్రపతి జగదీప్​ ధంఖర్​

Jul 19, 2024 - 18:27
 0
వాతావరణం మార్పులు తక్షణ చర్యలు అవసరం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వాతావరణంలోని మార్పులను పరిష్కరించడానికి తక్షణ చర్యలు అవసరమని ఉపరాష్ర్టపతి జగదీప్​ ధంఖర్​​ అన్నారు. శుక్రవారం న్యూ ఢిల్లీలోని పీహెచ్​ డీ చాంబర్​ ఆఫ్​ కామర్స్​ అండ్​ ఇండస్ట్రీ నిర్వహించిన బయోఎనర్జీ అనే అంశంపై నిర్వహించిన నాలుగో అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సదస్సులో ధన్​ కర్​ పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో వాతావరణ మార్పు వల్ల సముద్ర మట్టాలు పెరగడం, సుదీర్ఘమైన కరువు కాటకాలు, అటవుల విస్తీర్ణం తగ్గడం, తుపానుల వంటి విపత్తులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ పరిణామాలన్నీ మానవ పతనానికి కారణం కాగలవని ఆవేదన వ్యక్తం చేశారు. మానవాళికి ముప్పు జీవ వైవిధ్యంలో సమతుల్యత లేకపోవడం కూడా మరో కారణమన్నారు.

వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రతీ ఒక్కరూ తమను తాము మార్చుకునే పనిని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం ఆ దిశగా తీవ్ర కృషి చేస్తుందని తెలిపారు. సత్ఫలితాలను సాధిస్తున్నామన్నారు. 2030 నాటికి నాన్​ ఫాసిల్​ ఫ్యూయెల్​ ఆధారిత ఇంధన వనరుల నుంచి 50 శాతం విద్యుత్​ ఉత్పత్తి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రీసైక్లింగ్​ ద్వారా భారత్​ ఆశించిన ఫలితాలను సాధించేందుకు ప్రతీఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపరాష్ర్టపతి జగదీప్​ ధంఖర్​ స్పష్టం చేశారు.