మాజీ సీఎం ఎస్‌ఎం. కృష్ణ కన్నుమూత
ప్రధాని మోదీ సంతాపం
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ (92) మంగళవారం బెంగళూరులోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఈయన మృతిపట్ల ప్రధాని నరేంద్ర మృతి సంతాపం ప్రకటించారు. గత కొంతకాలంగా ఆయన వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్నారు. సామాజిక వర్గాల శ్రేయస్సు కోసం నిబద్ధతతో పనిచేసిన నాయకుడు కృష్ణ అన్నారు. ఎల్లప్పుడు ప్రజలను సంక్షేమ పథంలోకి తీసుకువెళ్లాలని తపన పనడేవారన్నారు. ఆయన కర్ణాటక సీఎంగా నిర్వహించిన పదవీ కాలంలో కల్పించిన మౌలిక సదుపాయాల కల్పనే ఇందుకు నిదర్శనమన్నారు. ఎస్ ఎం. కృష్ణ గొప్ప ఆలోచనాపరుడన్నాని మోదీ అన్నారు. ఎస్ ఎం కృష్ణ మృతి పట్ల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు. గౌరవ సూచకంగా మూడు రోజులపాటు సంతాప దినాలను ప్రకటించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.