96 స్థానాల్లో ప్రశాంతంగా పోలింగ్​ 705 మంది వందయేళ్లు పైబడిన వారు

నాలుగోదశ ఎన్నికలు 96 స్థానాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. 64 జనరల్​, 20ఎస్సీ, 12 ఎస్టీ స్థానాలున్నాయి. 1717 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 1540 మంది పురుషులు, 170 మంది మహిళలు పోటీలో ఉన్నారు.

May 13, 2024 - 09:41
 0
96 స్థానాల్లో ప్రశాంతంగా పోలింగ్​ 705 మంది వందయేళ్లు పైబడిన వారు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నాలుగోదశ ఎన్నికలు 96 స్థానాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. 64 జనరల్​, 20ఎస్సీ, 12 ఎస్టీ స్థానాలున్నాయి. 1717 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 1540 మంది పురుషులు, 170 మంది మహిళలు పోటీలో ఉన్నారు. 17.70 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అందులో 8.97 కోట్ల మంది పురుషులు, 8.73 కోట్ల మంది మహిళలున్నారు. 11,682 మంది దివ్యాంగులు, 705 మంది వంద యేళ్లు పైబడిన వారున్నారు. థర్డ్​ జెండర్​ 64 మంది ఉన్నారు. ఈ ఎన్నికల కోసం 19 లక్షల మంది ఎన్నికల సిబ్బంది పనిచేస్తున్నారు. 1.92 లక్షల పోలింగ్​ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 19 లక్షల మంది అధికారులు విధుల్లో ఉండగా, 4661 ఫ్లైయింగ్​ స్క్వాడ్​ బృందాలను విధుల్లో ఉన్నాయి. 1710 వీడియో పరిశీలన బృందాలు, 364 సూక్ష్మ పరీశీలకులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. 

కాగా మొదటి విడతలో 66.14 శాతం, రెండో విడతలో 66.71 శాతం, మూడో విడతలో 65.65 శాతం ఓటింగ్​ జరిగింది. రెండో విడతలో అత్యధికంగా ఓటింగ్​ జరగ్గా, మూడో విడతలో అత్యల్పంగా ఓటింగ్​ జరిగింది.