సత్వర పరిష్కారానికే ప్రజావాణి
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపేందుకే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో నిర్వహించి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 55 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఆ ధరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులను సమయానుకూలంగా పరిశీలించడంతో పాటు, సంబంధిత శాఖలకు తరలించి తక్షణమే పరిష్కారం చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేనని సూచించారు. శాఖలవారీగా పెండింగ్ లో వున్న వాటిని వెంటనే పరిష్కరించి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ఆన్‌లైన్ ప్లాట్ ఫాంలో సజావుగా క్లియర్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.