విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

హరీష్​ రావుకు   ముదిరాజ్​ సంఘం ఆహ్వానం

Oct 16, 2024 - 20:50
 0
విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

నా తెలంగాణ, ఆందోల్: ఆందోల్ మండల పరిధిలోని మాసానిపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ  ప్రతిష్టాపన మహోత్సవానికి విచ్చేయాలని  మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు పి. నారాయణ ముదిరాజ్ బుధవారం ఆహ్వానాన్ని అందజేశారు. ఆహ్వానం అందజేసిన వారిలో ఆందోల్ నియోజక వర్గ ముదిరాజ్ కన్వీనర్ డి. బి. నాగభూషణం ఉన్నారు. ఈ దేవాలయాన్ని నూతనంగా నిర్మించారు. 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహించనున్నారు.