రేషన్​ కుంభకోణం పశ్చిమ బెంగాల్​ లో ఈడీ సోదాలు

ED probes ration scam in West Bengal

Sep 13, 2024 - 20:08
 0
రేషన్​ కుంభకోణం పశ్చిమ బెంగాల్​ లో ఈడీ సోదాలు

కోల్​ కతా: పశ్చిమ బెంగాల్​ రేషన్​ కుంభకోణం కేసులో ఈడీ పలు ప్రాంతాల్లో శుక్రవారం దాడులు నిర్వహించింది. కోల్​ కతాలోని చక్రబెరియాతోపాటు బసంతి, జయనగర, కళ్యాణి సహా మరో ఆరు ప్రాంతాల్లో ఈడీ సోదాలను నిర్వహించింది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ టీఎంసీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్​ ను అరెస్టు చేసింది. రూ. 150 కోట్ల స్థిరాస్తులను సైతం జప్తు చేసింది. రేషన్​ ద్వారా అందుతున్న పీడీఎస్​ బియ్యాన్ని మల్లిక్​ అక్రమంగా తనకు అనుకూలంగా ఉన్న రైస్​ మిల్లులకు తరలించి సొమ్ము చేసుకున్నారే ఆరోపణలున్నాయి.