బతికే ఉన్న హమ్జా బిన్ లాడెన్!
Hamza bin Laden is alive!
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ బతికే ఉన్నాడని ఆఫ్ఘానిస్తాన్ లో అల్ ఖైదాకు న్యాయకత్వం వహిస్తున్నాడని వెల్లడైంది. ఈ మేరకు శుక్రవారం మీడియా అతని గురించిన పలు విషయాలను ప్రకటించింది. దీంతో అమెరికా జరిపిన దాడిలో హమ్జా మరణించాడనే వార్తలు నిరాధారమేనని ఋజువవుతోంది. హమ్జా ఆధ్వర్యంలో అల్ ఖైదా మళ్లీ బలోపేతం అవుతోంది. అంతేగాక భవిష్యత్ లో పాశ్చాత్య దేశాలపై భారీ దాడులకు వ్యూహారచన కూడా చేస్తున్నట్లు మీడియా హెచ్చరించింది. హమ్జా తన సోదరుడు అబ్దుల్లాతో కలిసి అల్ ఖైదాను బలోపేతం చేస్తున్నారని, చెదిరిపోయిన ఉగ్రవాదులను తిరిగి ఒక్కచోటుకు చేరుస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం ఇతను ఉన్న ప్రాంతంలో 450 మంది నిరంతర భద్రతను పర్యవేక్షిస్తున్నారని వివరించింది. ఈ విషయం బయటికి పొక్కడంతో అమెరికా ఇంటలిజెన్స్ అప్రమత్తమై వివరాలపై ఆరా తీస్తోంది.