నేపాల్​ లో విమాన ప్రమాదం 18మంది మృతి

18 killed in plane crash in Nepal

Jul 24, 2024 - 12:38
 0
నేపాల్​ లో విమాన ప్రమాదం 18మంది మృతి

ఖాట్మాండు: నేపాల్‌లో బుధవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో  18 మంది మృతి చెందగా పైలట్​ కు తీవ్ర గాయాలయ్యాయి. 

త్రిభువన్​ విమానాశ్రయం నుంచి 9ఎన్​–ఏఎంఈ విమానం పోఖారాకు వెళ్లాల్సిఉంది. టేకాఫ్​ చేసిన కొద్ది సేపటిలోనే విమానం కుప్పకూలింది. విమానంలో మొత్తం 19మంది ప్రయాణిస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సహాయక బృందాలను రంగంలోకి దింపారు. మంటలను ఆర్పివేసి 18 మంది మృతిచెందినట్లు ప్రకటించారు. పైలట్​ మనీష్​ కు తీవ్ర గాయాలయ్యాయని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. 

విమాన ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ప్రకటించలేదు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.