బీజాపూర్​ లో రెండో పేలుడు

ఐఈడీ పేలుడులో అసిస్టెంట్​ కమాండెంట్​ కు గాయాలు

Apr 19, 2024 - 14:40
 0
బీజాపూర్​ లో రెండో పేలుడు

రాయ్​ పూర్​: బీజాపూర్​ లో శుక్రవారం తొలివిడత జరుగుతున్న ఎన్నికల సందర్భంగా రెండోసారి ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో సీఆర్పీఎఫ్​ అసిస్టెంట్​ కమాండెంట్​ మనుకు ఎడమకాలు,ఎడమచేతికి గాయాలయ్యాయి. చిహ్కా పోలింగ్​ బూత్​ వద్ద ఈ పేలుడు సంభవించింది. కాగా గాయపడిన జవాను మనును వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్సనందింప చేస్తున్నారు. ఉదయం కూడా బీజాపూర్​ మరో పోలింగ్​ వద్ద ఐఈడీ పేలుడులో ఒక జవానుకు గాయాలైన విషయం తెలిసిందే.