లిక్కర్​ స్కాం మూడోరోజు విచారణ కవితను ప్రశ్నిస్తున్న ఈడీ

అరెస్టు చేయొద్దన్న పిటిషన్​ ఉపసంహరణ.. అక్రమ అరెస్టు పిటిషన్​పైనే విచారణ.. కవిత, కేజ్రీవాల్​లకు తీహార్​లో స్వాగతం పలుకుతానన్న సుఖేశ్​ చంద్రశేఖర్​

Mar 19, 2024 - 19:38
 0
లిక్కర్​ స్కాం మూడోరోజు విచారణ కవితను ప్రశ్నిస్తున్న ఈడీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను మూడో రోజు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కవిత దాఖలు చేసిన పిటిషన్​పై మంగళవారం సుప్రీంలో విచారణ జరగనుంది. కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకు ఢిల్లీ లిక్కర్ కేసు లో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కాగా.. తన అరెస్ట్ అక్రమమంటూ దాఖలు చేసిన ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగలవారం విచారణ జరిగింది. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ కపిల్ సిబల్ వాదించారు. కవితను రెండు రోజులుగా ములాఖత్​లో కేటీఆర్, హరీష్​ రావులు కలుస్తున్నారు. మనీలాండరింగ్​ కేసులో నిందితుడు సుఖేష్‌ చంద్రశేఖర్‌.. కవితకు లేఖ రాశాడు. ఈ లేఖలో తీహార్‌ జైలు క్లబ్‌లో త్వరలో మీరు కూడా సభ్యులు కాబోతున్నారన్నాడు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం త్వరలోనే అరెస్ట్​ అవుతారని సుఖేశ్​ లేఖలో పేర్కొన్నాడు. సింగపూర్‌, హాంకాంగ్‌, జర్మనీలో దాచుకున్న అక్రమ సంపాదన అంతా బయటపడుతుంది. వాట్సాప్‌ చాటింగ్‌, కాల్స్‌పై దర్యాప్తు జరుగుతోందని అన్నాడు. మీ ఇద్దరికీ తీహార్​ జైలులో స్వాగతం పలికేందుకు తాను ఎదురు చూస్తుంటానని సుఖేష్​ అన్నాడు. మద్యం కుంభకోణంలో కవితకు చెందిన రూ. 128.79 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. కవిత అరెస్టుపై ఈడీ అధికారిక లేఖ కూడా విడుదల చేసింది. ఆస్తుల జప్తును న్యాయశాఖ అనుమతిచ్చింది. కవిత, అరవింద్​కేజ్రీవాల్, మనీష్​ సిసోడియాలు కలిసి మద్యం కుంభకోణానికి ఆద్యులని ఈడీ ఈరోపించింది. ఈ వ్యవహారంలో ఆమ్​ ఆద్మీకి రూ. 100 కోట్లు ముడుపులు అప్పజెప్పడంలో కవిత కీలక పాత్ర పోషించారని ఈడీ ఆరోపిస్తోంది.