బంగ్లాలో మరో జలియన్​ వాలా బా గ్​!

ఇస్కాన్​ ఆలయం ధ్వంసం 15 అడుగుల బావిలో దాక్కున్న హిందువులు

Aug 13, 2024 - 15:45
Aug 13, 2024 - 15:50
 0
బంగ్లాలో మరో జలియన్​ వాలా బా గ్​!

ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనార్టీలు, హిందువులపై జీహాదీల దాడులు అన్నీ ఇన్నీ కావు. ఢాకా నుంచి 281 దూరంలో ఉన్న మెహ్రాన్ పూర్ లో జిహాదీలు భారీ ఎత్తున ఇస్కాన్ దేవాలయం, హిందు ఆస్తులు, వినియోగంపై దాడులు జరిగాయి. పూర్తి బంగ్లాదేశ్‌లో ఎక్కువగా హిందువులకు నష్టం ఇదే ప్రాంతంలో ఉంది. 

ఒకేసారి 500మంది ముష్కరులు హిందువులపై దాడికి రాగా అనేక హిందువులు ఈ ఆలయంలో వెళ్లి దాగున్నారు. ఆందోళనకారుల రూపంలో ఉన్న ఉగ్రవాదులు (జిహాదీ) నేరుగా ఇస్కాన్ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి తాళపత్ర గ్రంథాలు, భగవద్గీతలను కాల్చేశారు. పూర్తి మందిరంలోని విగ్రహాలు, అగ్నికి ఆహుతి చేశారు. వీరు ఈ చర్యలకు పాల్పడ్డారు ఆలయం పై భాగంలో ఉన్న 16 మంది హిందువులు తీవ్ర భయాందోళనలకు గురైలో ఓ పక్క ఉన్న 15 అడుగుల బాలోకి దూక. చప్పుడు చేయకుండా ఉండి ప్రాణాలు దక్కించుకోగలిగారు. ఈ ఘటన స్వాతంత్ర పోరాటంలో జలియన్ వాలా బాగ్ ను గుర్తు చేసుకునేలా ఉందని పూజారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ తమపై దాడులు జరగవచ్చని తమ ప్రాణాలకు హాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.