భారత్​కు బల్గేరియా కృతజ్ఞతలు

సాహసోపేత ఆపరేషన్​ను కొనియాడిన అధ్యక్షుడు, మంత్రి. ఉగ్ర కార్యకలాపాలపై భారత విధానానికి కట్టుబడే చర్యలన్న ప్రధాని మోదీ. స్నేహ ధర్మాన్ని ఎళ్లవేళలా నిర్వహిస్తామన్న మంత్రి జైశంకర్​

Mar 19, 2024 - 19:40
 0
భారత్​కు బల్గేరియా కృతజ్ఞతలు

నా తెలంగాణ, ఢిల్లీ: బల్గేరియా నౌక హైజాక్​ లో భారత్​ సాయం మరువలేనిదని ఆ దేశ విదేశాంగ మంత్రి మారియా గాబ్రియెల్, అధ్యక్షుడు రుమెన్​ రాదెవ్​ లు కృతజ్ఞతలు తెలిపారు. భారత నేవీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్​ వల్ల నౌకలోని తమ పౌరులు సురక్షితంగా ఉన్నారన్నారు. ఉగ్ర కార్యకలాపాలకు భారత్​ అనుసరించిన విధానానికి తాము కూడా కట్టుబడి ఉంటామని సమాధానం ఇచ్చారు. అధ్యక్షుడు, మంత్రుల స్పందనకు ప్రధాని మోదీ స్పందించారు. భారత్​ ఉగ్ర కార్యకలాపాలను సహించబోదన్నారు. మానవాళి సురక్షితంగా పరిఢవిల్లాలన్నదే తమ అభిమతమన్నారు. ఈ విషయంలో తాము అన్ని దేశాలతో కలిసి మెలిసి పనిచేస్తామని మోదీ పేర్కొన్నారు. విదేశాంగ శాఖ  మంత్రి జై శంకర్​ మాట్లాడుతూ భారత్​ అన్ని దేశాలతో స్నేహం కొనసాగిస్తోందని ఆపత్కాలంలో స్నేహ ధర్మాన్ని భారత్​ ఎళ్లవేళలా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్​కు గురైన వాణిజ్య ఓడను భారత నౌకాదళం క్లిష్టమైన ఆపరేషన్​ద్వారా రక్షించింది. వాయుసేన సీ17 ద్వారా మార్కోస్​ కమాండోలను రంగంలోకి దింపి 17 మంది బందీలను విడిపించింది. అందులో ఏడుగురు బల్గేరియాకు చెందిన వారున్నారు. వారిని సురక్షితంగా బల్గేరియాకు పంపే ఏర్పాట్లు చేసింది. అదే సమయంలో 35 మంది సముద్రపు దొంగలను అదుపులోకి తీసుకుంది. ఈ ఆపరేషన్​ మొత్తం 40 గంటలపాటు కొనసాగింది.