రెండో విడతకు సర్వం సిద్ధం
చత్తీస్ గఢ్ కు హెలికాప్టర్ లో సిబ్బంది, సామాగ్రి తరలింపు 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు పోలింగ్ మరో స్థానానికి మే 7న ఎన్నికల నిర్వహణ 2019లో అత్యధిక స్థానాలు గెలుపొందిన బీజేపీ రంగంలోకి 1198 మంది అభ్యర్థులు 250 మందిపై కేసులు, 390 మంది కోటీశ్వరులు రంగంలో లోక్ సభ అధ్యక్షుడు, ముగ్గురు కేంద్రమంత్రులు, ముగ్గురు సినీప్రముఖులు, మాజీ సీఎం
నా తెలంగాణ, న్యూఢిల్లీ: 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన చత్తీస్ గఢ్ లోని గరియాబంద్ పోలీస్ స్టేషన్ కు సిబ్బందిని ఎన్నికల సామాగ్రిని ఈసీ ప్రత్యేక హెలికాప్టర్ లో తరలించింది. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గురువారానికి 88 స్థానాల పోలింగ్ కు అంతా సిద్ధం చేసింది. అయితే వాస్తవానికి 89 స్థానాలకు పోలింగ్ జరగాల్సిన ఉన్నా 88 స్థానాలకే నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని బేతుల్ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి మృతి చెందడంతో ఇక్కడి ఎన్నికలను మే 7న నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.
ఆయా స్థానాల్లో 2019లో బీజేపీ అత్యధికంగా 50 సీట్లు గెలుపొందగా, ఎన్డీయే మిత్రపక్షాలు 8 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకుంది. ఇతరులకు 9 సీట్లలో విజయం లభించింది.
ప్రస్తుతం ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం రెండో దశలో 1198 మంది అభ్యర్థులు పోటీ ఉన్నారు. వీరిలో 1097 మంది పురుషులు కాగా, వంద మంది మహిళా అభ్యర్థులు ఒకరు థర్డ్ జెండర్ కావడం విశేషం.
అయితే ఏడీఆర్ అందించిన నివేదిక ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయనున్న 21 శాతం మంది అంటే 250 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అదే సమయంలో 390 మంది అభ్యర్థులు 33 శాతం మంది కోటీశ్వరులుగా పేర్కొంది. ఆరుగురి వద్ద ఆస్తులు జీరోగా, ముగ్గురి వద్ద 500 రూపాయల నుంచి వెయ్యి రూపాయలు మాత్రమే ఉండడం గమనార్హం. అంటే వీరి వద్ద మినమమ్ బ్యాంకు బ్యాలెన్స్ ఉంది.
167 మంది అభ్యర్థులపై హత్య, కిడ్నాప్ కేసులు ఉండగా, 21 మందిపై ద్వేషపూరిత ప్రసంగాల కేసులు నమోదయ్యాయి. ముగ్గురిపై హత్య కేసులు, 24 మందిపై హత్యాయత్నం కేసులు, 25 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించినకేసులు నమోదయ్యాయి.
కేరళలోని కాంగ్రెస్ అభ్యర్థి డీఎన్ కురియకోస్ పై 88 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
ఎన్నకల్లో హేమాహేమీలు రంగంలో ఉన్నారు. లోక్ సభ అధ్యక్షుడు ఓమ్ బిర్లా (కోటా), ముగ్గురు కేంద్ర మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్ (తిరువనంతపురం), గజేంద్ర సింగ్ షేకావత్ (జోధ్ పూర్), కైలాష్ విజయ్ వర్గీయ్ (బడ్మేర్), ఒక మాజీ సీఎం భూపేష్ బాగేల్ (రాజ్ నంద్ గావ్), ముగ్గురు సినీ రంగ ప్రముఖులు హేమామాలిని (మధుర), అరుణ్ గోవిల్ (మేరట్), సురేశ్ గోపీ (త్రిసూర్) నుంచి రంగంలో ఉన్నారు.
అయితే అత్యంత సంపన్నులుగా రంగంలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ మాండ్యాకు చెందిన వెంకటరమణ రూ. 622 కోట్లు, డీకే. సురేశ్ కాంగ్రెస్ పార్టీ రూ. 523 కోట్లు, బీజేపీ అభ్యర్థి హేమామాలిని రూ. 278 కోట్లతో ముందు వరుసలో ఉన్నారు.