భోపాల్: కాంగ్రెస్ దోపిడీకి అడ్డుకట్ట వేసేందకు 56 అడుగుల ఛాతీ ఉన్న మోదీ ఎప్పుడూ నిలబడి ఉన్నాడని ప్రధాని మోదీ అన్నారు. వారి అవినీతి, దుర్వినియోగాలు మోదీ ముందు చెల్లవన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ పనివారిని దూషిస్తూనే ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దేశ అభివృద్ధికి ఆటంకంగా నిలిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
రెండో రోజు మధ్యప్రదేశ్ లో ఎంపీ అభ్యర్థి శివమంగళ్ సింగ్ తోమర్ కు మద్దతుగా ప్రధాని ప్రచారం నిర్వహించారు. మోరీనా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో గురువారం ప్రసంగించారు.
మోదీపై పూలవర్షం.. జయ జయ ధ్వానాలు..
సభలో ప్రసంగించడానికి ముందు అరగంటపాటు ప్రధాని మోదీ ఓపెన్ టాప్ జీపులో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు సుమారు 1.50 కిలోమీటర్ల వరకూ ప్రజలు మోదీ మోదీ నినాదాలు, జయ జయ ధ్వానాలతో హోరెత్తించారు. ఆయనపై పూలవర్షం కురిపించారు.
నీతి నీజాయితీ పాలనంటే వారికి గుండెల్లో వణుకు..
కాంగ్రెస్ ఎప్పుడూ మోదీని దూషిస్తూనే ఉందన్నారు. వారు ఎన్నిసార్లు దూషించినా తాను ఏమీ బాధపడడం లేదన్నారు. ప్రజలకు తానేంటో తెలుసని పేర్కొన్నారు. తన నీతి నీజాయితీతో వారి గుండెల్లో వణుకు పుడుతుందని తెలిపారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తుంటే తన సుభిక్ష పాలన వల్ల వారి ఆటలు కొనసాగడం లేదని మోదీ తెలిపారు.
సైనికులకు స్వేచ్ఛనీయడం తప్పా..
శత్రువులు మనై ఒక్క బుల్లెట్ పేలిస్తే మనం పది బుల్లెట్లు పేల్చాలనే నీతిని ప్రస్తుతం మోదీ పాటిస్తున్నాడని తెలిపారు. దేశం కోసం సైనికులకు పూర్తి స్వేచ్ఛనీయడం తప్పా అని ప్రశ్నించారు. వారు ఒక ఫిరంగితే కాలిస్తే తాము పది ఫిరంగులతో కాలుస్తామని హెచ్చరించారు.
వారసత్వ చట్టంతో చెలగాటమా?..
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ వారసత్వ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు.కాంగ్రెస్ ఈ చట్టం ద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఇదే అంశాన్ని వారు మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నారని మోదీ తెలిపారు.
అసహ్యించుకుంటున్నారు..
అధికారం తమ వద్ద లేదనే క్షోభతో ఎప్పుడూ మోదీని తిడుతూనే ఆనందించడం వారికి పరిపాటిగా మారిందన్నారు. ప్రధానిపై ఇలాంటి భాష అసమంజసమైనదన్న ధ్యాస కూడా వారికి లేదన్నారు. ప్రజలంతా కాంగ్రెస్,కూటమి భాషపై అసహ్యించుకుంటున్నా వారికి తెలివి రావడం లేదని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు..
మత ప్రాతిపదికన దేశ ప్రయోజనాలను, నిరుపేదల కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాల ఫలాలను విభజించడానికి వీలు లేదన్నారు. దేశ వనరులపై వారికే సంపూర్ణ ప్రయోజనం చేకూర్చాలనే కృతనిశ్చయంతో తాము ఉన్నామని తెలిపారు. దేశంలోని అన్ని వర్గాలు, మతాల మద్దతుతోనే అభివృద్ధి ముడిపడి ఉందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. ఇందుకు నీతి నిజాయితీ ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోమారు బీజేపీని ఆశీర్వదించాలన్నారు.
పథకాల పంపకంలో అనేక వర్గాలు, వర్ణాలు,మతాలు, కులాలకు సమ ప్రాధాన్యతనిచ్చామన్నారు. ఎక్కడా నిరుపేదలకు చెడు జరగనీయకుండా నేరుగా వారి ఖాతాల్లోకే సంక్షేమ ఫలాల మొత్తాన్ని వేశామన్నారు. గత ప్రభుత్వంలో ఇలా ఉండేదా? అని మోదీ ప్రశ్నించారు.