రామాయణాన్ని కించపరిచిన విద్యార్థులు
జరిమానా విధించిన ముంబై ఐఐటీ అధికారులు
ముంబై: హిందువులు పవిత్రంగా భావించే రామాయణాన్ని ముంబై ఐఐటీకి చెందిన విద్యార్థులు అవమాన పరిచారు. ఈ ఇతిహాసంపై నాటక ప్రదర్శన చేపట్టిన విద్యార్థులు శ్రీరాముడిని కించపరిచేలా, హిందూ సంస్కృతీ, సాంప్రదాయాలను అగౌరవపరిచేలా వ్యవహరించారు. దీనిపై పెద్ద యెత్తున విమర్శలు చెలరేగడంతో యూనివర్సిటీ యాజమాన్యం నాటకానికి తెరలేపిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1.20 లక్షల జరిమానా, జూనియర్లకు రూ. 40 వేల జరిమానా విధించింది. కొన్ని రోజులపాటు వీరిని హాస్టల్స్ నుంచి నిషేధం విధించింది. మార్చి 31న నాటకాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో ఐఐటీ క్రమశిక్షణా చర్యలకు దిగింది.