మూడు రాష్ట్రాలు ఏటీఎంలే

మహారాష్ట్ర ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ

Nov 9, 2024 - 14:48
 0
మూడు రాష్ట్రాలు ఏటీఎంలే
ఆర్టికల్​ 370తో పాక్​ కు మేలు చేయాలనే దురాలోచన
మహాయుతికి ఆశీస్సులు కావాలి
ఈ రోజు సుప్రీం అయోధ్య తీర్పిచ్చిన రోజు
కులాల మధ్య చిచ్చుకు కాంగ్రెస్​ ప్రయత్నం
ముంబాయి: మూడు రాష్ట్రాలు కాంగ్రెస్​ రాజ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయని, ఆర్టికల్​ 370 ద్వారా పాక్​ కు మేలు చేయాలని ఇండికూటమి పార్టీలు భావిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. శనివారం మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన రెండో రోజు ఎన్నికల సభలో ప్రసంగించారు. 
 
ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ ల పేరు తీసుకోకుండానే ఈ పార్టీలు, నాయకులు ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి అన్నారు. కాంగ్రెస్​ గెలిచిన రాష్ట్రాల్లో రికవరి రెట్టింపు అయిందని విమర్శించారు. 
 
మహాయుతి కూటమికి మహారాష్ట్ర ఆసుల ఆశీస్సులు కావాలన్నారు. ఈ రోజు అత్యున్నత న్యాయస్థానంలో అయోధ్య రామాలయంపై తీర్పు ఇచ్చిన ప్రత్యేక రోజని గుర్తు చేశారు. సుప్రీం నిర్ణయం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. భారత్​ ఎంత బలహీనంగా మారుతుందో? మోదీ నేతృత్వంలో అంతే బలపరుస్తామని కాంగ్రెస్ కు బాగా తెలుసన్నారు. బలంగా మారితే వీరి ఆటలు సాగబోవనే ఉద్దేశ్యంతోనే కులాలు, జాతుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతీఒక్కరూ వీరి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
 
మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్​ రాజకుటుంబం పాలిస్తుందని కర్ణాటకలో మద్యం దుకాణదారుల నుంచి రూ. 700 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. హిమాచల్​, తెలంగాణ లు కూడా వీరికి ఏటీఎంలుగా మారాయన్నారు. ఆర్టికల్​ 370 ద్వారా మళ్లీ జమ్మూకశ్మీర్​ లో హింసకు ప్రోత్సాహం ఇచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. డా.బీఆర్​. అంబేద్కర్​ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. 
 
కులాలు తమలో తాము పోరాడుకోవాలనే కుటీల యత్నానికి కాంగ్రెస్​ తెరతీసిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు పోరాడుకుంటుంటే ఓట్లు చెల్లాచెదురు చేసి దేశంలో కాంగ్రెస్​ పార్టీ రావడానికి కుయుక్తులు పన్నుతుందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు.