మండిపడ్డ భారతీయులు
కేంద్రం సమన్లు
వెనక్కు తగ్గిన కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్
క్షమాపణలు, సరిచేసి ప్రసారం చేస్తామని హామీ
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ది కాందహార్ హైజాక్ ‘ఐసీ–814’ 1999పై నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన సినిమా పలు వివాదాలకు దారి తీస్తోంది. ఈ సినిమాలోని కిడ్నాపర్ల పేర్లను వాస్తవ పేర్లను గాకుండా హిందువుల పేర్లను వాడడంతో తీవ్ర ఆందోళన, వివాదాలు చెలరేగుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న ఈ సినిమాపై భారతీయులు మండిపాటు, కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో వెనక్కు తగ్గింది. భారతీయులకు క్షమాపణలు చెప్పింది. సినిమాలోని పేర్లను సవరించి విడుదల చేస్తామని ప్రకటించింది. మరోమారు తప్పిదాలను పునరావృతం కానీయబోమని హామీ ఇచ్చింది.
పూర్వాపరాలు..
ఖాట్మాండు నుంచి ఢిల్లీకి వస్తున్న విమానాన్ని ‘ఇబ్రహీం అథర్, సన్నీ అహ్మద్ ఖాజీ, జహూర్ ఇబ్రహీం, షాహిద్ అక్తర్, సయ్యద్ షకీర్ హర్కత్ ఉల్ ముజాహిదీన్ పాక్ కు చెందిన ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఈ సందర్భంగా పలువురు భారత జైళ్లలో మగ్గుతున్న ఉగ్రవాదులను విడిపించుకుపోయారు. ఈ విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్ఘాన్ లోని కాందహార్ విమానాశ్రయానికి తరలించారు.
దీని ఆధారంగా రూపొందించిన సినిమా ది కాందహార్ హైజాక్ లో ఉగ్రవాదుల పేర్లు, శంకర్, బోలా అని ఉచ్ఛరించారు. ఈ హైజాకింగ్ కు పాల్పడింది. వాస్తవానికి ఇస్లాం మతానికి చెందిన ఉగ్రవాదులైతే వారికి హిందూ పేర్లను జోడించి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ప్రసారమయ్యింది. ఇదే ఆగ్రహానికి కారణమయింది.
కేంద్రం గుస్సా..
సినిమాపై పలు విమర్శల నేపథ్యంలో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. వెంటనే నెట్ ఫ్లిక్స్ కంటెంట్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ ను పిలిపించి వెంటనే సినిమా ప్రదర్శనను నిలిపివేసేలా చర్యలు తీసుకుంది. సినిమాను ప్రదర్శించదలచుకుంటే వాస్తవ ఘటన, పేర్లను కూడా పొందుపరచాలని స్పష్టం చేసింది. మోనికా షెర్గిల్ ను కేంద్ర మంత్రిత్వ శాఖ గట్టిగానే మందలించిది. అసలు పేర్లు ఉచ్ఛరించకుండా, హిందువుల పేర్లు ఉచ్ఛరించేందుకు ప్రేరేపించిన ఘటనలు ఏమైనా ఉన్నాయా? అని నిలదీసింది. ఇస్లాం ఉగ్రసంస్థ ఉగ్రవాదుల పేర్లను ఎందుకు వాడలేదని నిలదీసింది. అసలు ఘటనను మరుగున పడేస్తూ హిందు పేర్లను ఉగ్రవాదులతో పోలుస్తూ వాడడం వెనుక మర్మం ఏమిటని ప్రశ్నించింది.
అదే సమయంలో నెట్ ఫ్లిక్స్ కు పూర్తి సమాధానం ఇవ్వాలని మంత్రిత్వ శాఖ సమన్లు కూడా జారీ చేసింది.
సోషల్ దుమారం..
సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం ద్వారా ఈ సినిమాలోని ఉగ్రవాదుల పేర్లపై పెద్ద రచ్చే జరిగింది. నెట్ ఫ్లిక్స్ పై భారతీయులు తీవ్ర విమర్శలు, ఆరోపణలు, బూతు పురాణాలు చేశారు. అనేకమంది మోనికా షెర్గిల్ ను ప్రత్యక్షంగానే టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు. చరిత్రను వక్రీకరించారని మండిపడుతూ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సినిమాను నిలిపివేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
సినిమా..
అనుభవ్ సిన్హా దర్శకత్వంలో వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో విజయవర్మ, నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్ రాజీవ్ ఠాకూర్, కుముద్ మిశ్రా, అరవిం స్వామిలు నటించారు.
మండిపడ్డ బీజేపీ..
సినిమాపై బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ సహా పలువురు ప్రముఖ నాయకులు మండిపడ్డారు. ఉగ్రవాదానికి ఊతం ఇచ్చేలా, అసలు విషయాలను, పేర్లను వక్రీకరిస్తూ ప్రచారం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సినిమాలోని పేర్లను సరి చేయకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
దిగొచ్చిన నెట్ ఫ్లిక్స్..
కేంద్రం, దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, హెచ్చరికల నేపథ్యంలో కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్ దిగి వచ్చారు. బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కంటెంట్ లోని పేర్లను తొలగించి తిరిగి ప్రచారం చేస్తామని కేంద్రమంత్రిత్వ శాఖకు హామీ ఇచ్చారు.