మంత్రులపై దాడులు శోచనీయం
Attacks on ministers are deplorable
నా తెలంగాణ, మెదక్: వరద బాధితులను పరామర్శించేందుకు, ఆదుకునేందుకు వెళితే మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడి, పువ్వాడ అజయ్, జగదీశ్వర్ రెడ్డిల దాడి శోచనీయమని బీఆర్ ఎస్ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బీఆర్ ఎస్ నేతలపై జరిగిన దాడిని ఆయన ఖండిస్తూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. బాధితులను పరామర్శిస్తుంటే, ఆదుకుంటుంటే ఎందుకు కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. చనిపోయిన బాధిత కుటుంబానికి రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే తప్పేంటన్నారు. బాధితులకు రూ. 5 లక్షలిచ్చి చేతులు దులుపుకోవడంపై మండిపడ్డారు. మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తిరుగుబాటు తప్పదన్నారు. మెదక్ పట్టణ బీఆర్ ఎస్ ఆందోళన చేపడుతుందన్నారు.