డ్రైవర్లు, సింగరేణి చర్చలు విఫలం
సమ్మెలో కొనసాగుతున్న వాహనదారులు
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: సింగరేణి వ్యాప్తంగా భూ నిర్వాసిత వాహన యజమానులు సమ్మెకు దిగడంతో పలు సింగరేణి గనులు, డిపార్ట్మెంట్, కార్యాలయంలో నడిచే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అద్దె వాహనాలు నడువకపోవడంతో మందమర్రి డివిజన్ రామకృష్ణాపుర్ ఏరియాలో సింగరేణి కార్మికులు, అధికారులు వృత్తిరీత్యా అవస్థలు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో జరిగిన అధికారుల కమిటీ, వాహన యజమానుల చర్చలు విఫలం అయ్యాయి. భూ నిర్వాసిత వాహన యజమానులు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. తాము సమస్యలతో సతమతమవుతున్న సింగరేణి యాజమాన్యం మాత్రం భూ నిర్వాసితులపై సవతితల్లి ప్రేమను చూపుతుందని మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు వాహనాలను పంపబోమని తేల్చిచెప్పారు. వాహన డ్రైవర్లలకు చెల్లించాల్సిన సిఎంపీఎఫ్ డబ్బులను తమ ఖాతాలో జమ చేసేవరకు వాహనాలను నడిపేది లేదని డ్రైవర్లు స్పష్టం చేశారు.