ఘనంగా ఆవిర్భావ వేడుకలు

A grand opening ceremony

Jun 2, 2024 - 20:49
 0
ఘనంగా ఆవిర్భావ వేడుకలు

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామాలయం చౌరస్తాలోని తెలంగాణ అమరవీరుల స్థూపం అఖిల సంఘాల నాయకులు, సింగరేణి మందమర్రి జీఎం మనోహర్ లు పూలమాలలు వేశారు. అనంతరం మనోహర్ ఠాగూర్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సూపర్ బజార్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జెండా ఎగురవేశారు. బీజేపీ, కాంగ్రెస్​, బీఆర్​ ఎస్​ పార్టీల కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.