భద్రకాళి ఆలయంలో అలరించిన చిన్నారుల సంగీత ప్రదర్శన
Children's musical performance at Bhadrakali Temple
నా తెలంగాణ, నిర్మల్: వరంగల్ భద్రకాళి దేవాలయంలో కొనసాగుతున్న శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం స్వర సుధ సంగీత పాఠశాలకు చెందిన చిన్నారులు తపన్ భరద్వాజ్, రోహన్, ఆద్విక, ప్రశంస, భవాని, ఉజ్వల, సాత్విక, మంజు, సుహాస్ తదితరులు ఆలపించిన కీర్తనలు అలరించాయి. పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి ఆధ్వర్యంలో పరాంకుశం శ్రీనివాస్ ఈ చిన్నారులకు సంగీతం నేర్పిస్తున్నారు. దేవాలయ అధికారుల నేతృత్వంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.