జిల్లా పర్యటనలో ఎస్ టీడబ్ల్యూసీ చైర్మన్ నేరెళ్ల శారద
ఘన స్వాగతం పలికిన జిల్లా కాంగ్రెస్ శ్రేణులు
నా తెలంగాణ, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గురువారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసారు. జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమెకు స్థానిక పెన్ గంగా అతిధి గృహం వద్ద ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి, సతీమణి కంది మౌనా శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూల బొకే అందించి ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సత్కరించారు. జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై శ్రేణులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ ఇంఛార్జి ఆడె గజేందర్, మహిళా నాయకురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళా విభాగం, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.