ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ గా అమర్ ప్రీత్ సింగ్
Amarpreet Singh as IAF Chief Marshal
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇండియన్ ఏయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ గా అమర్ ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. వివేక్ రామ్ చౌదరీ స్థానంలో సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 30న మధ్యాహ్నం అమర్ ప్రీత్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఐఏఎఫ్ తెలిపింది. సింగ్ 1964లో జన్మించారు. 1984లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలెట్ గా చేరారు. 40సంవత్సరాల సుధీర్ఘమైన అనుభవాన్ని సంపాదించారు. ఈయనకు ఐదువేల గంటలకు పైగా డిఫెన్స్ విమానాలు నడిపిన అనుభవం ఉంది. విద్యార్థి వచ్చి శిక్షకుడిగా ఎదిగారు. తన కెరీర్ లో ఒక ఆపరేషనల్ ఫైటర్ స్క్వాడ్రన్, ఫ్రంట్‌లైన్ ఎయిర్ బేస్‌కు నాయకత్వం వహించారు. రష్యాలోని మాస్కోలో మిగ్–29 అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ బృందానికి కూడా నాయకత్వం వహించారు. తేజస్ ను పరీక్షించే బాధ్యతలను రక్షణ శాఖ ఈయనకే అప్పగించింది.