డిమాండ్లు పరిష్కరించకుంటే రాజీనామాలే
ప్రభుత్వానికి వైద్యుల హెచ్చరిక
కోల్ కతా: వైద్య విద్యార్థినీపై లైంగిక దాడి, హత్య అనంతరం పలు డిమాండ్ల సాధనలో ప్రభుత్వం విఫలం కావడంతో ఆర్జీకర్ వైద్యులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం వరకు డిమాండ్లను అంగీకరించకుంటే 77 మంది వైద్యులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే జూనియర్ వైద్యులు చేస్తున్న దీక్షకు సీనియర్ వైద్యులు తమ సంఘీభావం ప్రకటించి 200మంది రాజీనామాలు సమర్పించారు. ఆదివారం జేఎన్ ఎన్ ఎం వైద్యులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఆరోగ్య వర్సిటీ రిజిస్ర్టార్ కు మెయిల్ పంపారు.