గూడఛారి సంస్థ దృష్టి పెడితే మటాషే
ప్రపంచదేశాలకూ వణుకు పుట్టించే ఆపరేషన్లు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: లెబనాన్ లో పేజర్ ద్వారా పేలుళ్లపై తీవ్ర కలకలం రేగుతోంది. బుధవారం వరకు ఈ పేలుళ్లలో 11 మంది చనిపోగా, మూడువేల మందికి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ పేలుళ్లపై హెజ్బుల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుళ్లు ముమ్మాటికి ఇజ్రాయెల్ పనేనని.
ఈ పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ ఉన్నదనేది ఆరోపణ. అయితే ఇజ్రాయెల్ ఏదైనా గూడా దాడులు చేపట్టేముందే తన మొస్సాద్‌తో పూర్తి సమాచారం తెప్పించుకుంటుంది. పకడ్బందీగా ఇసుమంతైనా సమాచారం బయటికి పొక్కకుండా దాడులు చేస్తుంది. అందుకే మొసాద్ ను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గూడాఛార వ్యవస్థగా గుర్తిస్తారు. మొస్సాద్ ఒక్కసారి దృష్టి సారించిందంటే వారి పని మాటే అన్న పేరు ఈ సంస్థకు ఉంది. అదే సమయంలో శత్రువులను సంహరించడంలో ఎప్పుడు ఒకే పద్ధతిని పాటించదు. శత్రువుపై ఎలాంటి దాడికి గురవుతుందో కూడా ఎవ్వరూ ఊహించని రీతిలో ఈసంస్థ దాడులు ఉంటాయి.
ఇప్పటివరకూ చరిత్రలో ఐదు అత్యధిక ముప్పు ఉన్న ఆపరేషన్లు మొస్సాద్ ప్రారంభించి విజయం సాధించాయి. వాటి గురించి తెలుసుకుందాం.
ఆపరేషన్ స్టక్స్‌నెట్: అణుశక్తితో కూడిన ఇరాన్‌ను ఇజ్రాయెల్ తన ఉనికికి ముప్పుగా మారింది. దీంతో ఇరాన్ అణుశక్తిని అడ్డుకోవాలని నిర్వీర్యం చేయాలనుకుంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి చెందిన ఇన్‌స్పెక్టర్లు ఇరాన్‌లోని నటాంజ్ యురేనియం శుద్ధీకరణ ప్రణాళికను సందర్శించారు. యురేనియం వాయువును సుసంపన్నం చేయడానికి ఉపయోగించే సెంట్రిఫ్యూజ్‌లు విఫలమవుతుండడాన్ని గమనించారు. ఈ సాంకేతిక కారణానికి కారణం ఏమిటో అన్నది మహామహులకే అంతుచిక్కలేదు. దీనితో ఇది ఖచ్చితంగా మొస్సాద్ పనేనని ఇరాన్ ఆరోపించింది. ఒక ప్రమాదకరమైన వైరస్ ను సెంట్రిఫ్యూజ్ లలోకి చొప్పించి అవి విఫలమయ్యేలా ఉన్నాయి.
ఇరాన్ అణు శాస్త్రవేత్తల హత్య: ఇరాన్ అణు బాంబు ఇద్దరు శాస్ర్తవేత్తలను 2020లో ఏఐ ఫీచర్ తో కూడిన రిమోట్ మెషిన్ గన్ తో హతమార్చింది. మొహ్సేన్ ఫక్రిజాదే అంతర్జాతీయంగా అణు శాస్ర్తవేత్తగా ప్రసిద్ధి చెందాడు. ఇతని కారును బుల్లెట్లు చీల్చుకుంటూ ఆయన శరీరంలోకి దూసుకువెళ్లాయి. అక్కడక్కడే మరణించాడు.
ఆపరేషన్ ప్లాంబాట్: ఆపరేషన్ ప్లాంబాట్ అనేది 1968లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ నిర్వహించిన రహస్య ఆపరేషన్. ఈ ఆపరేషన్ యొక్క ఉద్దేశ్యం సుసంపన్నమైన యురేనియం (ఎల్లోకేక్ యురేనియం) ఈజిప్టు చేతుల్లోకి రాకుండా నిరోధించడం. ఈ ఆపరేషన్ సమయంలో, మొస్సాద్ ఏజెంట్లు నార్వేలో 'స్కై' అనే ఓడను హైజాక్ చేసి యురేనియం స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేశారు. ఓడను హైజాక్ చేసి అనుకున్నట్లుగానే దాన్ని అవీవ్ కు టెల్. దీంతో ఈజిప్టుకు తీవ్ర నష్టం కలిగింది.
ఆపరేషన్ ఒపెరా: ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ దాని పరిసరాల్లో అణుశక్తిని అంగీకరించదు. 1980లలో ఇరాక్ అణు ప్రారంభించినప్పుడు, ఇజ్రాయెల్ వెంటనే అప్రమత్తమైంది. ఇరాక్‌లోని ఒసిరాక్ అణు రియాక్టర్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడిని ప్రారంభించారు, దీనిని ఆపరేషన్ ఒపెరాగా పిలుస్తారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన అణువణువు కోసం మొస్సాద్ ద్వారానే ఇజ్రాయెల్ వాయుసేన తీసుకొని ఒక్కసారిగా ఈ రియాక్టర్ ను పూర్తిగా ధ్వంసం చేసింది. దీంతో ఇరాన్ అణుశక్తి ఆపరేషన్ ను కొన్నేళ్లపాటు వాయిదా వేయాల్సి వచ్చింది.
ఆపరేషన్ ఎంటెబ్బే: ఆపరేషన్ ఎంటెబ్బే ఇజ్రాయెల్ సైన్యం, మొస్సాద్ చేసిన విజయవంతమైన ఆపరేషన్ ఇది. ఉగాండాలోని ఎంటెబ్బే విమానాశ్రయంలో 1976 జూలై 4న జరిగింది. ఉగాండాలో కిడ్నాప్ చేయబడిన ఇజ్రాయెల్, ఇతర ప్రయాణీకులను రక్షించడం ఈ ఆపరేషన్ లక్ష్యం. ఉగ్రవాదులను పూర్తి తప్పుదవ పట్టించేలా ఉగాండా అధ్యక్షుడి వాహన శ్రేణి ఏయిర్ పోర్ట్ లోకి వస్తున్నట్లుగా వాహనాలను ఏర్పాటు చేసి వారు హైజాక్ చేసిన ప్లాన్ వద్దకు వందమంది కమెండోలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ ఆపరేషన్ మొత్తం 95 నిమిషాల్లో పూర్తి చేసి 45 మందిని హతమార్చారు. 102 మంది బందీలను సురక్షితంగా విడిపించారు.
ఇప్పటికీ ప్రపంచదేశాల్లో ఇజ్రాయెల్ గూడఛార వ్యవస్థ అంటే వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటుందన్నది జగమెరిగిన సత్యం.