హిందూ జనాభా 54 శాతం తగ్గుదల!

ముంబాయిలో 2051 నాటికి

Nov 11, 2024 - 17:24
 0
హిందూ జనాభా 54 శాతం తగ్గుదల!
టీఐఎస్​ఎస్​ సర్వే నివేదికలో ఆందోళనకర విషయాలు
అక్రమ వలసదారులకు అవలీలగా ప్రభుత్వ పత్రాలు
సహకరిస్తున్న రాజకీయ, స్థానిక, అధికారులు
రోహింగ్యా, బంగ్లాదేశీ అక్రమ వలసలతో భారత్ కు పెరుగుతున్న​ ముప్పు
ముంబాయి: ముంబాయిలో అక్రమ వలసదారుల సంఖ్య 2051నాటికి హిందూ జనాభా 54 శాతం తగ్గి, రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల జనాభాలో భారీ వృద్ధి నమోదు కానున్నట్లు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్​ఎస్​) సర్వే నివేదికలో స్పష్టం చేసింది. టాటా నివేదిక విడుదల సోమవారం ఢిల్లీలోని జవహార్​ లాల్​ యూనివర్సిటీలో జరిగింది. ఈ సదస్సులో టాటా ఇన్‌స్టిట్యూట్ పీఆర్వో వీసీ, జేఎన్‌యూ వీసీ, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్‌ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ) సంజీవ్‌ సన్యాల్‌ ప్రసంగించారు. 
 
ఎలాంటి పత్రాలు లేని అక్రమ వలసదారులు నకిలీ ఓటర్ ఐడీలను, ఆధార్​ కార్డులు, రేషన్​ కార్డులు, డ్రైవింగ్​ లైసెన్సులు లాంటివి కూడా అవలీలగా సాధిస్తున్నారని ఆ సర్వేలో తేలిందని సన్యాల్​ తెలిపారు. అక్రమ వలసదారులకు వీటిని అందించడంలో నాయకులు, స్థానికులు, పలు వర్గాల వారీతోపాటు ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ అధికారులు కూడా ఇందుకు కారణంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఇలా చొరబడిన వారిని ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోవడంతోపాటు విధ్వంసాలకు తెరతీస్తున్నారని ఆరోపించారు. 
మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై దౌర్జన్యాలపై సన్యాల్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వలసలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్నారు. 
 
అక్రమ వలసదారుల సమస్య కేవలం భారత్​ కే కాదని, అమెరికా, మరిన్ని ప్రపంచదేశాలకు కూడా ఉందని అన్నారు. వీటిని శాశ్వత, న్యాయమైన పరిష్​కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని సన్యాల్​ తెలిపారు. 
 
టాటా ఇన్‌స్టిట్యూట్‌ వీసీ శంకర్‌దాస్‌ మాట్లాడుతూ.. అక్రమ వలసదారుల సామాజిక, ఆర్థిక రాజకీయ విశ్లేషణ- డేటా సమర్పించామన్నారు. దేశంపై చూపే ప్రతికూల ప్రభావాలను వివరించారు. ఇండో–-పాక్ సరిహద్దు నుంచి డ్రగ్ స్మగ్లింగ్-, భద్రత, సాంస్కృతిక సవాళ్లను ఎదుర్కొంటున్నామని తెలిపారు. మయన్మార్ లో రోహింగ్యా సంక్షోభం -భారతదేశానికి ఆందోళన కలిగించే అంశంగా అభివర్ణించారు. అక్రమ వలసదారుల వల్ల జనాభా పెరుగుదల ముప్పు, భాష, సంస్కృతిపై ప్రభావం చూపుతుందన్నారు. రాడికలైజషన్​ ముప్పు ఎక్కువవుతుందన్నారు. దీంతో స్థానిక పౌరుల్లో అశాంతి నెలకొంటుందని స్పష్టం చేశారు. అక్రమ వలసదారులను స్థానికులను వివాహాలు చేసుకోవడం ద్వారా వారి కుటుంబం మొత్తం లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. అదే సమయంలో భారతీయుల నిరుపేద కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమైన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయన్నారు. అసోం, ఝార్ఖండ్​, పశ్చిమ బెంగాల్​ లలో అక్రమ వలసలు గతంలో కొనసాగినా, ప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయాయని ప్రొఫెసర్​ శంకర్​ దాస్​ తెలిపారు.