ఆజాద్ కు ఝలక్ మాజీ మంత్రి డీపీఏపీకి బైబై
Azad Ku Jhalak ex-minister bye to PAP
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో డీపీఏపీ (పార్టీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ) గులాం నబీ ఆజాద్ కు ఎదురు దెబ్బ తగిలింది. శనివారం మాజీ మంత్రి తాజ్ మొహియుద్దీన్ డీపీఏపీకి బైబై చెప్పారు. తాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈయన ఏ పార్టీలో చేరతారనేది ఇంకా వెల్లడికాలేదు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను సీఈసీ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామం జరగడంతో గులాం నబీ ఆజాద్ ఖంగుతిన్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో సేవలందించిన ఆజాద్ తన సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.
సెప్టెంబర్ 8 తొలి దశలో స్థానాలు..
మొదటి దశలో పాంపోర్, పుల్వామా, త్రాల్, జైనపురా, రాజ్‌పురా, షోపియాన్, కుల్గామా, దేవ్‌సర్, డిఎస్‌పురా, డోరు, కోకెమాగ్ (ఎస్టీ), అనంత్‌నాగ్ వెస్ట్, శ్రీగుఫ్వారా, బిజ్‌బెహరా, అనంతనాగ్, షాంగస్- అనంత్‌నాగ్‌లో ఈస్ట్, ఇంటర్‌వాల్, పహల్గామ్, పద్దర్-నాగసేని, కిష్త్వార్, దోడా, భదర్వా, దోడా వెస్ట్, బనిహాల్, రాంబన్‌లలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 25 రెండో దశ..
రెండవ దశలో గందర్‌బల్, కంగన్ (ఎస్‌టి), ఖన్యార్, హజ్రత్‌బాల్, హబ్బక్‌దల్, చన్నపురా, లాల్ చౌక్, సెంట్రల్ షల్తాంగ్, జడిబాల్, ఈద్గా, బుద్గాం, ఖాన్‌సాహిబ్, బీర్వా, చదూరా, చార్-ఎ-షరీఫ్, గుల్బర్గ్ (ఎస్‌టి), శ్రీ. మాతా వైష్ణోదేవి, రియాసి, కాకాకోటే సుందర్‌బని, నవ్‌షేరా, బుధాల్, రాజౌరి, తన్నమండి, పూంచ్ హవేలీ, సురంకోట్, మెండల్‌లలో ఎనికలు నిర్వహించనున్నారు.
అక్టోబర్ 1న మూడో దశ..
మూడో దశలో ట్రెఘం, కర్నా, కుప్వారా, లోలాబ్, లాంగటే, హంద్వారా, సోపోర్, ఉరి, రఫియాబాద్, గుల్మార్గ్, బారాముల్లా, పటాన్, వాగూరి-క్రీరీ, బందిపోరా, సోనావాడి, గురేజ్ (ఎస్టీ) ఉధంపూర్ వెస్ట్, ఉధంపూర్ ఈస్ట్, రాంనగర్ (ఎస్సీ), చెనాని, బని, బసోహి, బిల్లావద్, జస్రోటా, కథువా (ఎస్సీ), హీరానగర్, రామ్‌గఢ్, (ఎస్సీ), సాంబా, బిష్నా (ఎస్సీ), విజయ్‌పూర్, సుచేత్‌గఢ్ (ఎస్సీ), ఆర్ఎస్ పురా జమ్మూ సౌత్, జమ్మూ ఈస్ట్, బహు, నగ్రోటా , జమ్మూ వెస్ట్, మార్హ్ (ఎస్సీ), అఖ్నూర్ (ఎస్సీ), చాంబ్‌లలో ఎన్నికలు నిర్వహించనున్నారు.